హైదరాబాద్, నవంబర్ 19, ప్రభాతవార్త : మావో యిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ప్రాంతాలకు కేంద్రం ఇచ్చే నిధులను సాధ్యమై నంత ఎక్కువగాతెచ్చుకోవడానికి ఆర్‌అండ్‌బి అధి కారులు ప్రతిపాదనలు తయారుచేశారు. దేశవ్యా ప్తంగా మావోయిస్టు ప్రభావం అధికంగా ఉన్న 8 రాష్ట్రాల్లో 33 జిల్లాలకు కేంద్రం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుంది. మన రాష్ట్రంలో ఖమ్మం జిల్లాకు కూడా ఈవిధంగా 4వందల కోట్ల రూపా యలకు పైగా మంజూరు చేసింది.
ఈ నేప థ్యంలో ఖమ్మంలోనే మరో ఐదు రోడ్ల అభివృద్ధి కోసం రహదారులు, భవనాల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి సూచనమేరకు అధికారులు కొత్తగా ప్రతిపాదనలు తయారుచేశారు. ఈఐదురోడ్ల అభి వృద్ధికి సుమారు 180 కోట్ల రూపాయలు అవ సరం అవుతాయని అంచనా వేశారు. వీటితో పాటు మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఒరిస్సా,ఛత్తీస్‌గఢ్ రాష్ట్రసరిహద్దు జిల్లాల్లో కూడా రోడ్ల విస్తరణ, అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఇప్పటికే ఆర్‌అండ్‌బి అధికారులు కేం ద్రానికి ప్రతిపాదనలుపంపించారు.ఛత్తీస్‌గఢ్ సరి హద్దులో ఉన్న ఖమ్మం జిల్లాకు ఏ విధంగా కేం ద్రం నిధులు ఇచ్చిందో ఆ విధంగానే ఉత్తరాంధ్ర తోపాటు తూర్పుగోదావరి జిల్లాకు నిధులు మం జూరు చేయాలని ప్రతిపాదిం చారు.
రాష్ట్రంలో మొన్నటి వరకు మావోయిస్టు కార్య కలా జిజి పాలు అంతగా లేకపోయినప్పటికీ సరి హద్దు రాష్ట్రాలైన ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌లో తీవ్ర స్థాయిలో ఉన్నాయి. దీని ప్రభావం సరిహద్దులో ఉన్న శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలపై పడుతుందని ఆర్ అండ్ బి అధికారులు చెబుతున్నారు. నిఘా వర్గాలు కూడా ఆంధ్రా-ఒరిస్సా బోర్డర్‌లో మావో యిస్టు కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్న విషయాన్ని వారు ఉదహరిస్తున్నారు.
కాబట్టి దట్టమైన అడవితో కూడిన ఈ నాలుగు జిల్లాల్లో రోడ్ల విస్తరణకు, ఉన్న వాటిని పటిష్ఠప ర్చడానికి నిధులు ఇవ్వాలని రహదారులు భవ నాలశాఖ కేంద్రాన్నికోరుతోంది. అయితే ఈ ప్రతి పాదనలపై ఇప్పటివరకు కేంద్రం నుండి ఎటు వంటి స్పందనరాలేదు. దీంతో రాష్ట్రానికి సంబం ధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న వివిధ అం శాలపై చర్చించడానికి ప్రభుత్వం మంగళవారం జూబ్లీ హాలులో నిర్వహించిన ఎంపిల సమావే శంలో మంత్రి గల్లా అరుణకుమారి ఈ విష యాన్ని వారి దృష్టికి తీసుకువచ్చారు. దీనితో పాటు రాష్ట్రంలోని ఏడు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని పంపిన ప్రతిపాదనలను కూడా ఆమె వారి దృష్టికి తీసుకు వచ్చారు.
జాతీయరహదారి18ఎలో పూతలపట్టు- తిరుపతి మధ్య 58 కిలోమీటర్లు, జాతీయ రహ దారి 234లోని మంగుళూర్-కొల్లాపురం మధ్య 23 కిలోమీటర్లకు సంబంధించి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా గెజిట్ నోట ిఫికేషన్ జారీ చేయకపోవడం తదితర విషయా లను మంత్రి అరుణకుమారి పార్లమెంటు సభ్యు లకు వివరించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ప్రతి పాదనలు తయారుచేసికేంద్రానికిపంపాలని ఆమె అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రహదా రులకు సంబంధించి పార్లమెంటు, రాజ్యసభకు చెందిన సభ్యులు కూడా గట్టి పట్టుదలతో ఉండ టంతో రాష్ట్ర ప్రతిపాదనలకు కేంద్ర ఆమోద ముద్ర వేస్తుందనే అభిప్రాయంతో రహదారులు, భవనాలశాఖ అధికారులు ఉన్నారు. అందులో భాగంగా మావోయిస్టు ప్రభావిత జిల్లాలుగా పైన పేర్కొన్న నాలుగు జిల్లాలను కూడా గుర్తిస్తే సుమారు 15వందల కోట్ల రూపాయల వరకు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది.
ఖమ్మం జిల్లాలో కొత్తగా ప్రతిపాదించిన రోడ్లు 1) భద్రాచలం-చండ్రుపట్ల 47.00కిలోమీటర్లు 2) నెల్లిపాక-పోచారం 16.10 కిలోమీటర్లు 3) రాజమండ్రి-భద్రాచలం 9.20 కిలోమీటర్లు 4) నర్శీపట్నం-లక్కవరం51.70 కిలోమీటర్లు 5) కూనవరం-చట్టి 25.90 కిలోమీటర్లు