| బ్లేడ్ గ్యాంగ్ బహిష్కరణ |
| శుక్ర వారం, నవంబర్ 20, 2009 , 3:45 [IST] |
 |
|
విజయవాడ, నవంబర్ 19, ప్రభాతవార్త : అరాచకాలకు పాల్పడుతున్న ఐదుగురు బ్లేడ్‌బ్యాచ్ సభ్యులను నగరంనుంచి బహిష్కరిస్తున్నట్లు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలో బ్లేడ్ బ్యాచ్ సభ్యుల ఆగ డాలు తీవ్రస్థాయికి చేరాయన్నారు.
దారిన వెళ్ళే ప్రజలపై బ్లేడ్‌లతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచి వారి నుంచి నగదు,వస్తువులు దొంగిలిస్తున్నారని చెప్పారు. మద్యం మత్తులో బ్లేడ్‌బ్యాచ్‌సభ్యులు ఒకరిపైమరొ కరు దాడులకు పాల్పడి హత్యలు చేసుకోవడం వంటి సంఘటనలు జరిగాయన్నారు. వివిధ దుశ్చర్య లకు పాల్పడుతూ ప్రజలను అశాంతికి గురిచేస్తున్నారని, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఐదుగురు బ్లేడ్‌బ్యాచ్ సభ్యులను విజయవాడ నగరం నుంచి బహిష్కరిస్తున్నామని వివరించారు. ఇప్పటికే వీరిపై అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయని చెప్పారు.
నగరం నుంచి బహిష్కరించిన బ్లేడ్‌బ్యాచ్ సభ్యుల్లో నగరంలోని కృష్ణలంకకు చెందిన సిరపంగి ఐజాక్, గాంధీపార్కు ఏరియాకు చెందిన బడకల్ శ్రీను, పప్పల నవీన్, రత్నంసెంటర్‌కు చెందిన కర్రి శ్రీనివాసరావు, వన్‌టౌన్ ఏరియాకు చెందిన మర్రి నాగమో హన్ వున్నారన్నారు.
|
|
|
|
|
|
|