| ఇందిరకు ఘన నివాళి |
| శుక్ర వారం, నవంబర్ 20, 2009 , 3:57 [IST] |
 |
|
ఇం దిరకు ఘన నివాళి న్యూఢిల్లీ : మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 92వ జయంతిని పురస్కరించుకుని గురువారం దేశ వ్యాప్తంగా ఆమెకు ఘన నివాళులర్పించారు. దివం గత నేత స్మారకస్థలి 'శక్తి స్థల్ వద్ద ఆమెకు పుష్ప గుచ్ఛాలతో నివాళులర్పించినవారిలో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్‌సింగ్, యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఉన్నారు. ఇందిర జయంతి సందర్భంగా వందలాది పూలతో అలంకరించిన ఆమె సమాధి వద్ద జరిగిన కార్యక్రమాల్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ కూడా పాల్గొన్నారు. 1917, నవంబర్ 19న జన్మించిన ఇందిరాగాంధీ భారతదేశానికి తొలి మహిళా ప్రధానిగా సేవలందించారు.
1964లో తన తండ్రి, ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మరణించడంతో తదుపరి లాల్ బహదూర్‌శాస్త్రి మంత్రివర్గంలో ఆమె సమాచార, ప్రసారశాఖ మంత్రిగా పనిచేశారు. లాల్‌బహ దూర్‌శాస్త్రి ఆకస్మిక మరణంతో ఆమె ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
|
|
|
|
|
|
|