Home » జాతీయ వార్తలు » కొత్త సిఐఓ ఖరారుకు అద్వానీ, మొయిలీని కలవనున్న ప్రధాని
కొత్త సిఐఓ ఖరారుకు అద్వానీ, మొయిలీని కలవనున్న ప్రధాని
శుక్ర వారం, నవంబర్ 20, 2009 , 3:59 [IST]
కొత్త సిఐఓ ఖరారుకు అద్వానీ, మొయిలీని కలవనున్న ప్రధాని
న్యూఢిల్లీ, నవంబర్ 19 : నూతన ప్రధాన సమాచార కమిషనర్ పదవికి పేరును ఖరారు చేయడానికి ప్రధాని మన్మోహన్‌సింగ్ శుక్రవారం ప్రతిపక్ష నాయకుడు ఎల్.కె.అద్వానీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్పమొయిలీని కలుసుకుంటారు. సింగ్ అమెరికా బయలుదేరడానికి ఒకరోజు ముందు శుక్రవారం సాయంత్రం ఈ సమావేశం జరగ నున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఇంతకు ముందు సిఐసిగా ఉన్న వజహత్ హబీబుల్లా రాజీనామా చేసిన దాదాపు నెలరోజుల తర్వాత ఈ సమావేశం జరగనుంది. సిఐసి పదవికి ఎంపిక ప్రక్రియలో పారదర్శకత ఉండాలని, ప్రభుత్వాధికారి కాని వ్యక్తిని ఆ పదవిలో నియమించాలని ఆర్‌టిఐ కార్యకర్తలు చేస్తున్న డిమాండ్‌ను సమావేశంలో పరిగణనలోకి తీసుకునే అవకాశమున్నది. ఈ పదవికి పరిశీలిస్తున్న అభ్యర్దుల పేర్లు బయటకు వెల్లడి కానప్పటికీ, పౌరవిమానయానశాఖ కార్య దర్శి మాధవన్ నంబియార్, పర్యావరణవేత్త శేఖర్‌సింగ్, సమాచార కమిషనర్ ఎ.ఎన్.తివారి సహా పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.