మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

Bharathmatrimony
లాగిన్ | రిజిస్టర్
ఇందిరాగాంధీ శాంతి అవార్డుకు షేక్‌ హసీనా ఎంపిక
శుక్ర వారం, నవంబర్ 20, 2009 , 4:00 [IST]

ఇందిరాగాంధీ శాంతి అవార్డుకు షేక్‌ హసీనా ఎంపిక
న్యూఢిల్లీ, నవంబర్‌ 19 : ప్రజాస్వామ్యం, బహుళ పక్ష రాజకీయ వ్యవస్థ అభివృద్దికి విశిష్ట సేవలం దించినందుకు 2009 సంవత్సరానికి శాంతి, నిరా యుధీకరణ, అభివృద్దికి ఇచ్చే ప్రతిష్టాత్మక ఇందిరా గాంధీ శాంతి బహుమతికి బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా వాజెద్‌ ఎంపికయ్యారు. గత సంవత్సరం ప్రధానిగా ఎన్నికైన తర్వాత షేక్‌ హసీనా దారి ద్య్రాన్ని, అసమానతలను తొలగించడం ద్వారా బంగ్లాదేశ్‌ను మధ్య ఆదాయ దేశంగా మార్చే లక్ష్యం తో 'విజన్‌2021 దిశగా కృషి చేస్తున్నారని ప్రధాని కార్యాలయం (పిఎంఓ) గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ''ప్రపంచశాంతిని పెంపొం దించడానికి బంగ్లాదేశ్‌ కట్టుబడి ఉన్నట్లు ఈ ప్రకటన ధ్రువీకరిస్తున్నది అని పిఎంఓ ఓ ప్రకటనలో పేర్కొన్నది. దారిద్య్రాన్ని నిర్మూలించి, తన ప్రజలకు సామాజిక, ఆర్ధిక న్యాయం కలుగజేయడానికి షేక్‌ హసీనా కృతనిశ్చయంతో చేస్తున్న సేవలను గుర్తించినట్లు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలోని అంతర్జాతీయ న్యాయనిర్ణేతల సంఘం తెలిపింది. హసీనా బంగ్లాదేశ్‌ వ్యవస్థాపక పితామహుడైన ముజిబుర్‌ రెహ్మాన్‌ కుమార్తె. వచ్చే సంవత్సరం ఆమె ఈ అవార్డును అందుకుంటారు. అవార్డు కింద ఆమెకు రూ.25లక్షల నగదు, జ్ఞాపికను అందజేస్తారు.
 
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 వైశ్యులంతా ఓటుహక్కును..
 కొందరు కాంగ్రెస్‌సీనియర్ల..
 తారలు దిగివచ్చిన వేళ...
 కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
 పోలీసు వ్యవస్థలో మార్పులు రావాలి:..
 జగన్‌ ఓదార్పుపై ప్రధాని పిలుపుతో..
 కాశ్మీర్‌లో అన్నివర్గాలతో..
 ఇసి కొత్త కమిషనర్‌గా ఎపి కేడర్‌..
 చట్టసభల్లో రిజర్వేషన్లకోసం..
 అక్రమమైనింగ్‌పై లోక్‌సభలో టిడిపి..
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com