| స్కూల్‌గేమ్స్ నేషనల్స్ క్యాలెండర్ |
| శుక్ర వారం, నవంబర్ 20, 2009 , 4:41 [IST] |
 |
|
స్కూల్‌గేమ్స్ నేషనల్స్ క్యాలెండర్ ఖమ్మం-ప్రభాతవార్త క్రీడాప్రతినిధి : జాతీయ స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పలు క్రీడాంశాల్లో నిర్వహించే జాతీయస్థాయి పోటీల క్యాలెండర్ విడుదలైంది. క్యాలెండర్ ప్రకారం డిసెంబర్‌లో 18 క్రీడాంశాల్లో జాతీయ స్థాయి పోటీలు ఉండగా, ఒక ఢిల్లీలోనే దాదాపు 13 క్రీడాంశాల్లో జాతీయపోటీలు నిర్వహిం చనున్నారు. అయితే నిధుల సమస్య వంకతో ఇప్పటికే అథ్లెటిక్స్, బాస్కెట్ బాల్ క్రీడాంశంలో రాష్ట్ర జట్లు జాతీయ పోటీల్లో పాల్గొనని సంగతి విదితమే. ఈ నేపథ్యంలో డిసెంబర్‌లో పలు క్రీడాంశాల్లో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్ర జట్ల ప్రాతినిద్యం అనుమానంగానే ఉంది. పోటీల వివరాలు : జాతీయ స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం అండర్-14 బాలుర ఫుట్‌బాల్ డిసెంబర్ 15 నుండి 20 వరకు ఆగార్తా లలో, అండర్-17 బాలబాలికల ఫుట్‌బాల్ డిసెంబర్ 16 నుండి 21 వరకు ఉత్తరప్ర దేశ్‌లోని అలహాబాద్‌లో, అండర్-14,17,19 బాలబాలికల జూడో డిసెంబర్ 20 నుండి 24 వరకు తిరువ నంతపురంలో, అండర్-14 బాలుర క్రికెట్ డిసెంబ ర్ 22 నుండి 26 వరకు మహారాష్ట్రలోని ముంబా యిలో, అండర్-14,17,19 బాలికల రెజిలింగ్ డిసెంబర్ 12,13 తేదీల్లో మహారాష్ట్రలోని షోలాపూర్‌లో జరగనున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో డిసెంబర్ 24 నుండి 29 వరకు జరగనున్న జాతీయస్థాయి పాఠశాలల క్రీడల పోటీల్లో అండర్- 17,19 బాలబాలికల స్కేమార్షల్ ఆర్ట్స్, అం డర్-17,19 బాలబాలికల వెయిట్‌లిప్టింగ్, అండర్-14 బాలబాలికల వాలీబాల్, అండర్- 14,17,19 బాలురరెజిలింగ్, అండర్- 17,19 బాలుర బాక్సింగ్, అండర్-11,14, 17,19 బాలబాలికల రోలర్‌స్కేటింగ్, అండర్-19 బాలుర రోలర్‌హకీ, అండర్- 14, 19 బాలబాలికల బేస్‌బాల్, అండర్-14,17,19 బాలబాలికల యో గా, అండర్-19 బాలబాలికల త్రోబాల్, అండర్- 19 బాలబాలికల హ్యాండ్‌బాల్, అండర్-19 బాలుర క్రికెట్, అండర్-19 బాలబాలికల నెట్‌బాల్ క్రీడాం శాలు ఉన్నాయి. జనవరిలో... 2010 జనవరి 7 నుండి 11 వరకు చత్తీస్‌ఘఢ్‌లోని రాజనందిగామ్‌లో అండర్-14 బాలబాలికల హాకీ, అండర్-19 బాలబాలికల రోప్‌స్కిప్పింగ్, జనవరి 17-24 వరకు అంకోలాలో అండర్-14 బాలుర బాక్సింగ్, జనవరి 7 నుండి 11 వరకు పూణేలో అండర్-17 బాలబాలికల సైక్లింగ్ క్రీడాంశాల్లో జాతీ యపోటీలు జరగనున్నాయి. ఏపిలో కబడ్డీ, బాస్కెట్‌బాల్ జాతీయ పోటీలు పాఠశాలల క్రీడల జాతీయస్థాయి కబడ్డీ, బాస్కెట్ బాల్ పోటీలు ఆంధ్రప్రదేశ్‌లో జరగ నున్నాయి. అండర్-17 బాలబాలికల కబడ్డీ పోటీలు డిసెంబర్ 24 నుండి 28 వర కు నల్లగొండలో, అండర్-19 బాలబాలికల బాస్కెట్‌బాల్ పోటీలు జనవరి 10 నుండి 14 వరకు పశ్చిమగోదావరి జిల్లాలో రాష్ట్ర స్కూల్‌గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్లు రాష్ట్ర కార్యదర్శి కె.రామిరెడ్డి తెలిపారు.
|
|
|
|
|
|
|