| శర్వానంద్ 'అందరి బంధువయ' |
| శని వారం, నవంబర్ 21, 2009 , 1:23 [IST] |
 |
|
శర్వానంద్, పద్మప్రియ జంటగా చంద్ర సిద్దార్థ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తన్న 'అందరి బంధువయ చిత్రం కోసం ఇటీవల వైజాగ్, అరకు పరిసర ప్రాంతాల్లో రెండు పాటలను చిత్రీకరించారు. దీంతో షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత చంద్ర సిద్దార్థ మాట్లాడుతూ 'చిత్రీకరణ పూర్తయింది. వచ్చే నెల మొదట్లో పాటలను విడుదల చేస్తాం. కథ విషయానికొస్తే మానవీయ అంశాలతో ముడిపడ్డ వినోదాత్మక చిత్రమిది. అందరూ నా వాళ్ళే. నేను అందరి వాడిని అనుకుంటూ తోటివారిపై ఆప్యాయత చూపాలి అనే అంశం అంతర్లీనంగా వ్ఞంటుంది.
వినోదంతో పాటు ప్రేమ సన్నివేశాలు ఈ చిత్రంలో ప్రధానంగా వ్ఞంటాయి.ప్రస్తుతం డబ్బింగ్ జరుగుతున్న ఈ చిత్రంలో ఏడు పాటలుంటాయి అని అన్నారు. నరేష్, ఆర్కే, కృష్ణభగవాన్, నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: చైతన్య ప్రసాద్, సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: జె.కె.గుమ్మడి. దర్శకత్వం: చంద్రసిద్దార్థ.
|
|
|
|
|
|
|