| గమ్యానికి అడుగు దూరం |
| శని వారం, నవంబర్ 21, 2009 , 1:37 [IST] |
 |
|
జీవన పోరాటంలో అనుకున్న లక్ష్యాలను సాధించడానికి చేసే ప్రయత్నంలో ఎదురయ్యే అనుభవాలను బట్టి చిన్న చిన్న మార్పులు కోరుకోవడం సహజం.అయితే మంచి మార్పు కోరుకున్నంత తొందరగా రావాలంటే ఎలా? ఇక్కడున్న చిన్నచిన్న సలహాలు పాటిస్తే, ఫలి తాలు మాత్రం పెద్దగా ఉంటాయి. మరి త్వరగా ప్రయత్నించండి మరి. చేరుకోవాలనుకున్న లక్ష్యమేమిటో ముందు రాసిపెట్టుకోండి. అది మీ కళ్లకు కనిపించేలా మీ గది గోడమీదో, మీ టేబుల్ మీదో పెట్టుకోండి. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొనడానికి అవసరమైన స్ఫూర్తినిచ్చే మాటలను, కొటేషన్లను మీ పరిసరాల్లో కనిపించేలా పెట్టుకోండి.
అవి నిత్యం మీలో సాధించాలనే తపనను, ఉత్సా హాన్ని నింపుతాయి. మీ జీవితంలో మీరు కోరుకుంటున్న మార్పును, మీ ఉన్నతిని ఆహ్వానించే సన్నిహితులు, స్నేహి తులతో కాస్త సమయం గడపండి.వారితో చర్చించే విషయాలు మీలో కొత్త మార్పులను శ్రీకారం చుడతాయి.మీ అభిరుచులకు, మీకు ఎక్కువ ఆనందాన్ని పంచే కార్యక్రమాలకు కాస్త సమయం కేటా యించుకొని తనివితీరా ఆనందించండి. ఆ శక్తి మీ లక్ష్యసాధనకోసం కష్టించడానికి ఉపయోగ పడుతుంది.
మీరు ఎంచుకున్న లక్ష్యం, మీ జీవిత విధానం, మీరు ఉంటున్న కుటుంబ పరిస్థితులు ఇవ న్నింటిపై అవగాహన ఉండి ఎలాంటి గందర గోళానికి తావివ్వకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రాధాన్యతనివ్వండి. రోజులో కనీసం పదినిమిషాలు సమయం మిమ్మల్ని మీరు వినేందుకు కేటాయించుకోండి. ఇవి చాలు మీలో మీరు కోరుకున్న మార్పు వచ్చేందుకు, మిమ్మల్ని ప్రణాళికాబద్దంగా గమ్యం వైపు నడిపించేందుకు.
|
|
|
|
|
|
|