పిల్లల్ని చక్కగా పెంచడం అనేది సాధారణ విషయం కాదు, అల్లరి పిడుగులు ఉన్న తల్లులకు ప్రతిరోజు ఒక పరీక్షలాగే ఉంటుంది. అలాంటి అమ్మలకోసం కొన్ని సూచనలు ఇదిగో.పిల్లలు బాగా అల్లరి చేసిన సందర్భాల్లో ఒక్కొక్కరు ఒక్కోరకంగా స్పందిస్తూ ఉంటారు. కొట్టడం, తిట్టడం, బెదిరించడం టీచర్లకి చెబు తానని భయపెట్టటం మొదలైనవన్నీ. అయితే ఇలాంటి సందర్భాల్లో కాస్త సహనంగా వ్యవ హరించి ఉంటే బాగుండేది అని తరువాత అనిపిస్తుంది. ఇలా అనుకునేవారు ఆయా సందర్భాల్లో నిజంగానే సహనంగా ప్రవర్తించాలి అంటే- మీఇంట్లో జరుగుతున్న వ్యవహారమంతా ఎవరైనా గమనిస్తున్నారు అనే భావనతో ఉండండి. దాంతో ఇతరుల ముందు ఎలా మర్యాదపూర్వకంగా సహనంగా ప్రవర్తిస్తారో అలా మారగలుగుతారు.
అల్లరిచేసే పిల్లలు అందరికీ ఒకటే మంత్రం పని చేయదు. ఒక తల్లి ఈ విషయం గురించి ఇలా చెబుతోంది-'నాకు ఇద్దరు పిల్లలు. వారి అల్లరిని కంట్రోల్ చేయడానికి ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతి పాటిస్తాను. పదిహేనేళ్ల మా పెద్దబాబుని మాట వినేట్టు చేయడానికి పాకెట్ మనీ లేదా మొబైల్ ఫోన్ని కట్ చేస్తాను. ఆరేళ్ల రెండవవాడి అల్లరి ఆపడానికి వాడిని వాడి బెడ్రూం లోంచి బయ టకి రానివ్వనని బెదిరిస్తాను.తల్లులు ఒక విష యాన్ని గమనించాలి. పిల్లలు అందరూ ఒక్కలా ఉండరు. వారిని ఆపాలంటే ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతి పాటించాలి.పిల్లలు అల్లరి చేయగానే వారిని పట్టుకుని తిట్టటం, కొట్టటం చేసేస్తారు చాలామంది. అలా కాకుండా వారు చేసిన పని ఎందుకు సరికాదో, మనం ఎందుకు శిక్ష విధిస్తున్నామో వారికి తెలిసేలా చెప్పాలి.
పిల్లల్ని మన చెప్పుచేతల్లో ఉంచడం, మనం చెప్పినట్లు వినేలా చేయటం అంత తేలిక కాదు. కొంతమంది పిల్లలు బాగా చిలిపి పనులు చేస్తూ ఫూల్స్లా ప్రవర్తించి తల్లిదండ్రుల్ని ఏడిపిస్తుం టారు. తల్లిదండ్రులు ఏం చెబుతారో దానికి వ్యతిరేకంగా చేయాలని చాలామంది పిల్లలు అనుకుంటారు. ఇలాంటపుడు తల్లిదండ్రులు ఇరిటేషన్కి గురికాకుండా నవ్వి ఊరుకుంటే సరిపోతుంది. పిల్లలతో వాదనకు దిగకుండా, మీరు చెప్పదలచుకున్నది చెప్పేముందు తప్ప కుండా వారు చెబుతున్నది వినాలి. హాస్యంతో మీ పిల్లల్ని వారి అభిప్రాయాలనుంచి బయటకు తెచ్చే ప్రయత్నం చేయడమూ మంచిదే.