మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
కేంద్రం మెడపై కత్తిలా పత్తి
శని వారం, నవంబర్ 21, 2009 , 1:47 [IST]
ఎంఇవి ప్రసాదరెడ్డి

cottonహైదరాబాద్‌ నవంబర్‌ 20:- చెరకు ధర నిర్ణయంలో రైతులు, ప్రతిపక్షాల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిన కేంద్ర ప్రభుత్వానికి మరో సవాలు సిద్ధం అవుతున్నది. చెరకు వివాదంలో ఇండియన్‌ షుగర్‌ మిల్స్‌ అసోసియేషన్‌ ఒత్తిడికి ప్రభుత్వం లొంగి ఎఫ్‌ఆర్‌పి పేరుతో కొత్త ధరను రైతుల మీద రుద్దడానికి ప్రయత్నించిందన్న విమర్శలు చెలరే గాయి. ఇప్పుడు పత్తి రైతుల విషయంలో కూడా ప్రభుత్వం అగ్నిపరీక్ష ఎదుర్కోనున్నది. ప్రభుత్వం రైతుల పక్షపాతమా, లేక మిల్లుల పక్షపాతమా అన్న విషయం తేలాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈసంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా పత్తి ఉత్పత్తి తగ్గగా ఇండియాలో పత్తి ఉత్పత్తి పెరిగింది. పత్తి దిగుమతి కోసం చైనా పాకిస్తాన్‌లు ఇండియా ఎగుమతిదారులతో బేరసారాలు నడుపుతు న్నాయి. ఈ దశలోనే దేశీయ టెక్స్‌టైల్‌ మిల్లులు ముడిపత్తి ఎగుమతి నిషేధించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతు న్నాయి.

ఆ ఒత్తిడికి లొంగితే తాము మరోసారి మిల్లులకు వత్సాసు పలికినట్లు అవుతుందని ప్రభుత్వం భయపడుతుంది. గత సంవత్సరం పత్తి ఎగుమతులపై ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది. దీనితో విదేశాల్లోనూ తమ పోటీదారులకంటే స్థానికంగా కంపెనీలు ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ రైతులకు చేరలేదని, దళారీలు వ్యాపారులు అప్పటికే పత్తిని కొనుగోలు చేసి రైతులకు చెందాల్సిన సబ్సిడీని ఖాజేసారని విమర్శలు వచ్చాయి.2009-10 సీజన్‌లో ఇండియాలో పత్తి లభ్యత సంతృప్తికరంగా ఉన్నందున మిల్లులకు ఎగుమతిదారులకు చాలినంత పత్తి లభ్యం అవుతుందని పరిశీలకులు చెబుతున్నారు. అయితే టెక్స్‌టైల్‌ మిల్లులు మాత్రం ఎగుమతికి అనుమతి ఇస్తే ధరలు పెరుగుతాయని భయపడు తున్నాయి. భారతీయ టెక్స్‌టైల్‌ మిల్లులు ఇతర దేశాల కంటే పత్తి చౌకగా లభ్యం కావడం వల్లనే అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతి చేయగలు గుతున్నాయి. అవి తమ పోటీతత్వాన్ని ఇంకా పెంచుకోవాల్సి ఉంది.

 పత్తి ఎగుమతుల వల్ల పత్తి రైతులకు మంచి ధర లభించి పంట విస్తీర్ణం బాగా పెరిగింది. తమ పత్తి నాణ్యతను పెంచ డానికి రైతులు ప్రయత్నం చేస్తున్నారు. పత్తి రైతులు ఆధునిక విత్తనాలను స్వీకరించడమే కాకుండా ఉత్పత్తిని బాగా పెంచగలిగారు. గత నాలుగు సంవత్సరాలుగా ఈ ఉత్పత్తి ఆధారంగా ఎగుమతిదారులు అంతర్జాతీయంగా కొంత మంది కస్టమర్లను సంపాదించారు. ఈసంవ త్సరం హఠాత్తుగా పత్తి ఎగుమతి నిలిపివేస్తే ఈ కస్టమర్లు ఇండియా మీద విశ్వాసాన్ని కోల్పోతారు. భారతీయ పత్తి అంతర్జాతీయ మార్కెట్లో వెలిగిపోయే రోజులు దగ్గరకు వస్తున్నాయి. ఈ అవకాశాన్ని చేతులారా పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి రాదు.

పత్తి ఎగుమతిని నిషేధిస్తే ముడిపత్తిని టెక్స్‌టైల్‌ మిల్లులు తక్కువ ధరకు కొనుగోలు చేసి లాభాలు సంపాదిస్తాయన్న విశ్వాసం లేదు. ఈ టెక్స్‌టైల్‌ రంగంలో అనేక లోపాలు ఉన్నాయి. సప్ల§్‌ు ఛెయిన మేనేజ్‌మెంట్‌ సరిగ్గా లేకపోవడం, చిన్న,చిన్నయూనిట్లు చాలా ఉండటం వంటి కారణాల వల్ల టెక్స్‌టైల్‌ మిల్లులు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. టెక్స్‌టైల్‌ మిల్లులు పత్తి మార్కెట్లోకి రాగానే తొందరగా కొనుగోలు చేయాలని తర్వాత ఎగుమతికి అవకాశం ఇవ్వవచ్చునని భావిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇండియాకు ఎటువంటి దిగుమతి సుంకాలు లేకుండా ఏడు నుంచి ఎనిమిది లక్షల బేళ్ల పత్తి దిగమతి అవుతున్నది.
 
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 కొబ్బరి మార్కెట్‌కు ముందుంది పండగ
 కొల్హాపూర్‌లో గేట్‌వే హోటల్
 మెక్‌డోవెల్‌ హోల్డింగ్స్‌ ఫలితాలు
 రేమండ్‌ వీల్‌ కొత్త వాచ్‌
 బేకర్స్‌ ఇన్‌ నుంచి ఉత్పత్తులు
 బంగారంలో ప్లాటినం లోహాల ఉనికి
 వ్యవసాయరంగానికి భారీ రుణాలు
 ఎయిర్‌ ఇండియాపై ఫిర్యాదు
 పెరిగిన టాటా మోటార్స్‌ అమ్మకాలు
 పెరిగిన ఫిన్‌ ఎయిర్‌ టర్నోవర్‌
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com